Viral Video: వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం.. మచిలీపట్నంలో ఘటన.. వీడియో ఇదిగో!
ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా తీర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మచిలీపట్నంలో ఇటీవల భారీ వర్షం కురిసింది. దీంతో సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాలిలోతు నీరు నిలిచింది.
Machilipatnam, July 15: ఆంధ్రప్రదేశ్ లో (Andhrapradesh) పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ కారణంగా తీర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మచిలీపట్నంలో (Machilipatnam) ఇటీవల భారీ వర్షం కురిసింది. దీంతో సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాలిలోతు నీరు నిలిచింది. ఆ వరదలోనే అటుగా వెళ్తున్న ఓ వాహనం నుంచి పాల ప్యాకెట్ల (Milk Packets) ట్రేలు కిందపడ్డాయి. ఆ వరదలో పాలప్యాకెట్లు కొట్టుకు రావడంతో మొదట ఆశ్చర్యపోయిన జనం.. తేరుకుని వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. మోకాళ్ల లోతు నీటిలో పాల ప్యాకెట్లను ఏరుకుంటున్న జనాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.
Heavy rain lashed Machilipatnam, inundating the famous Sai Baba temple junction. People jumped into knee-deep water after they found milk packets floating on it. #AndhraPradesh pic.twitter.com/SCjfWROGFi
— Ashish (@KP_Aashish) July 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 15, 2023 09:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

