 
                                                                 Hyderabad, July 15: బాలీవుడ్ ప్రముఖ నటి (Bollywood Actress) ఆలియా భట్ (Alia Bhatt) ఇటీవల తన తల్లి, సోదరితో కలిసి ముంబైలోని (Mumbai) ఓ రెస్టారెంట్‌కు (Restaurant) వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. సింప్లిసిటీకి కేరాఫ్ మీరేనంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. రెస్టారెంట్ నుంచి ఆలియా తన కుటుంబసభ్యులతో కలిసి బయటకు వస్తుండగా జర్నలిస్టులు ఆమెను చుట్టుముట్టారు. ముగ్గురూ కలిసి ఫొటోకు పోజివ్వండంటూ తెగ రిక్వెస్ట్ చేశారు. ఇంతలో అక్కడి భద్రతా సిబ్బంది జర్నలిస్టులను వెనక్కు జరగమని చెప్పారు. ఈ హడావుడిలో ఓ ఫొటోగ్రాఫర్ చెప్పు ఊడి కింద పడిపోయింది. తన కారువైపు వస్తున్న ఆలియాకు ఆ చెప్పు కనబడింది. ‘‘ఎవరో చెప్పు జారవిడుచుకున్నట్టు ఉన్నారు.. ఇది ఎవరిదీ?’’ అని ఆమె ప్రశ్నించింది.
Such a CUTIE 🥰 Alia Bhatt is all heart as she picks up paparazzi’s slipper and gives it back to concerned photog as we click her with mom and sister post dinner in Mumbai #ManavManglani pic.twitter.com/0w8Ck5SDgm
— Manav Manglani (@manav22) July 13, 2023
కింద ఉన్న చెప్పును తీసుకుని
జర్నలిస్టులేమో కంగారుగా.. ‘‘మీరేం పట్టించుకోకండి.. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి’’ అని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, జర్నలిస్టులు వద్దంటున్నా వినకుండా ఆలియా కింద ఉన్న చెప్పును తీసుకుని వారికి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అంత పెద్ద స్టార్ అయిన ఆలియా సింప్లిసిటీ చూసి జనాలు ముచ్చటపడుతున్నారు. ఆ వీడియో మీరూ చూడండి.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
