Odisha: ఒడిశాలో దారుణం, తీసుకున్న రూ.1500 తిరిగి ఇవ్వలేదని యువకుడిని రెండు కిలోమీటర్లు స్కూటర్‌కు కట్టేసి లాక్కెళ్లారు, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఒడిశాలోని కటక్ లో దారుణం జరిగింది. ఓ యువకుడి చేతుల్ని తాడుతో కట్టేసి రెండు కిలోమీటర్ల దూరం అతన్ని స్కూటర్‌తో లాక్కెళ్లారు. ఈ ఘటనకు చెందిన సమాచారం తమకు రాత్రి 11 గంటలకు అందినట్లు కటక్‌ డీసీపీ పినాక్‌ మిశ్రా తెలిపారు. నిందితుల్ని, బాధితుడిని గుర్తించామని పోలీసులు తెలిపారు.

Odisha: ఒడిశాలో దారుణం, తీసుకున్న రూ.1500 తిరిగి ఇవ్వలేదని యువకుడిని రెండు కిలోమీటర్లు స్కూటర్‌కు కట్టేసి లాక్కెళ్లారు, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Youth Was Tied to a Scooter and Dragged on a Busy Road in Cuttack (Photo-ANI)

ఒడిశాలోని కటక్ లో దారుణం జరిగింది. ఓ యువకుడి చేతుల్ని తాడుతో కట్టేసి రెండు కిలోమీటర్ల దూరం అతన్ని స్కూటర్‌తో లాక్కెళ్లారు. ఈ ఘటనకు చెందిన సమాచారం తమకు రాత్రి 11 గంటలకు అందినట్లు కటక్‌ డీసీపీ పినాక్‌ మిశ్రా తెలిపారు. నిందితుల్ని, బాధితుడిని గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.బాధితుడిని జగన్నాథ్‌ బెహరాగా గుర్తించారు. అతను నిందితుడి వద్ద నుంచి 1500 అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అనుకున్న సమయానికి డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడతను. దీంతో నిందితుడిని స్కూటర్‌కు కట్టేసి రెండు కిలోమీటర్ల దూరం లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 18, 2022 11:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).