ఒడిశాలోని కటక్ లో దారుణం జరిగింది. ఓ యువకుడి చేతుల్ని తాడుతో కట్టేసి రెండు కిలోమీటర్ల దూరం అతన్ని స్కూటర్‌తో లాక్కెళ్లారు. ఈ ఘటనకు చెందిన సమాచారం తమకు రాత్రి 11 గంటలకు అందినట్లు కటక్ డీసీపీ పినాక్ మిశ్రా తెలిపారు. నిందితుల్ని, బాధితుడిని గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.బాధితుడిని జగన్నాథ్ బెహరాగా గుర్తించారు. అతను నిందితుడి వద్ద నుంచి 1500 అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అనుకున్న సమయానికి డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడతను. దీంతో నిందితుడిని స్కూటర్‌కు కట్టేసి రెండు కిలోమీటర్ల దూరం లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.
Odisha | A youth was tied to a scooter and dragged on a busy road in Cuttack for more than 2 kilometres
We got information about the incident around 11 pm. Today, we've identified both the accused & the victim. The accused have been taken into custody: Cuttack DCP Pinak Mishra pic.twitter.com/t3DG0eS3dG
— ANI (@ANI) October 18, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)