Hyderabad, Dec 7: తెలంగాణలోని (Telangana) నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పులిజాల గ్రామంలో తృటిలో ఓ చిన్నారికి (School Student) పెద్ద ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన ప్రభుత్వ స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పిల్లర్ల మధ్య తల పెట్టింది. అందులో తల ఇరుక్కుపోవడంతో కేకలు వేసింది. ఇది గమనించిన టీచర్లు.. గ్రామస్థుల సాయంతో పిల్లర్లను చిన్న ముక్కలుగా తొలగించారు. చివరకు బాలిక తలను సురక్షితంగా బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Here's Video:
పాపం.. పిల్లర్ల మధ్య ఇరుక్కున్న చిన్నారి తల
నాగర్ కర్నూలు - అచ్చంపేటలో మండలం పులిజాల గ్రామంలోని ప్రభుత్వ స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటూ పిల్లర్ల మధ్య తల పెట్టింది.
అందులో తల ఇరుక్కుపోవడంతో కేకలు వేసింది.. ఇది గమనించిన టీచర్లు, గ్రామస్థుల సాయంతో పిల్లర్లను… pic.twitter.com/G4NcXhsm2O
— Telugu Scribe (@TeluguScribe) December 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)