Women Weds Lord Krishna: చిన్ని కృష్ణయ్యను పెండ్లాడిన గ్వాలియర్ యువతి.. ఫోటోలు వైరల్

మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ నగరం న్యూ బ్రజ్‌ విహార్‌ కాలనీలో నివసించే శివాని పరిహార్‌ (23)కి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టం, భక్తి క్రమంగా పెరిగిపోయింది.

Women Weds Lord Krishna: చిన్ని కృష్ణయ్యను పెండ్లాడిన గ్వాలియర్ యువతి.. ఫోటోలు వైరల్
Women Weds Lord Krishna (Credits: X)

Newdelhi, Apr 20: మధ్యప్రదేశ్‌ (Madhyapradesh) లోని గ్వాలియర్‌ నగరం న్యూ బ్రజ్‌ విహార్‌ కాలనీలో నివసించే శివాని పరిహార్‌ (23)కి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే (Lord Krishna) ఎంతో ఇష్టం. ఆ ఇష్టం, భక్తి క్రమంగా పెరిగిపోయింది. దీంతో చివరకు ఆ భగవానుడ్నే తన భర్తగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు తమ కుమార్తె నిర్ణయంపై ఆందోళన చెందారు. అది అసాధ్యమని ఆమెను వారించారు. కానీ, యువతి మాత్రం తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారిని ఒప్పించింది. చివరకు బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా శ్రీకృష్ణుడ్ని వివాహం చేసుకుంది.  ఏప్రిల్ 18న కృష్ణుడితో ఈ పెళ్లి జరిగింది. అలా వేదమంత్రాల సాక్షిగా ఆ భగవంతుడ్ని శివాని తన భర్తగా చేసుకుంది.

Surya Thilak on Mulugu Lord Ram: నుదుటన సూర్య తిలకం ఆ అయోధ్య రాముడికే కాదు.. మన తెలంగాణలోని రాముడికి కూడా.. ములుగులోని చిన్ని రాముడి నుదుటన సూర్య తిలకం.. తన్మయత్వంతో పులకించిన భక్త జనం

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 20, 2024 09:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).