
Mulugu, Apr 20: శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి (Ayodhya Lord Ram) నుదుటన సూర్య కిరణాలు (Surya Thilak) ప్రసరించడాన్ని చూసి యావత్తు భక్తజనం తన్మయత్వంతో పులకించిపోయింది. అయితే, తెలంగాణలోని ములుగు (Mulugu) జిల్లా ఏటూరునాగారంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం కూడా అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.

ఉదయం విగ్రహ మూర్తులను అలంకరించిన తరువాత సూర్యకిరణాలు నేరుగా శ్రీ రామచంద్రమూర్తి విగ్రహం నుదిటిపై పడినట్టు అర్చకులు తెలిపారు. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.