Kedarnath Temple Opened: ఆర్మీబ్యాండ్ మేళాలతో తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు (వీడియోతో)
ప్రసిద్ధ చార్‌ధామ్ ఆలయాల్లో కేదార్‌నాథ్ ధామ్ ఒకటి. ఉత్తరాఖండ్ లోని గర్వాల్ ప్రాంతంలోని ఈ ఆలయం తలుపులు మంగళవారం ఉదయం తెరుచుకున్నాయి. ఉదయం 6.20 గంటలకు ఆర్మీబ్యాండ్ మేళాలతో ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.
Newdelhi, April 25: ప్రసిద్ధ చార్‌ధామ్ ఆలయాల్లో (Chardham Temples) కేదార్‌నాథ్ ధామ్ (Kedarnath Temple) ఒకటి. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని గర్వాల్ ప్రాంతంలోని ఈ ఆలయం తలుపులు మంగళవారం ఉదయం తెరుచుకున్నాయి. ఉదయం 6.20 గంటలకు ఆర్మీబ్యాండ్ మేళాలతో ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకోవడంతో హరహర మహాదేవ్ కీర్తనలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని 35 క్వింటాళ్ల పూలతో అలకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు జగద్గురు రావల్ భీమ్ శంకర్‌లింగ్ శివాచార్య ఆలయం తలుపులు తెరిచారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయం తలుపులు తెరిచిన అనంతరం కేదార్ ధామ్‌ను దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
#WATCH | Uttarakhand: The portals of Kedarnath Dham opened for devotees. Kedarnath Temple Chief Priest Jagadguru Rawal Bhima Shankar Ling Shivacharya opened the portals. pic.twitter.com/WjPf2fcYdg
— ANI (@ANI) April 25, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 25, 2023 09:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

