13 Runs From 1 Ball: ఒక బాల్‌కి 13 పరుగులు, ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్, వీడియో ఇదిగో..
భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) ఒక్క బంతిలోనే 12 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన చివరి మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. సికందర్ రజా మొదటి ఓవర్‌లో తొలి బంతిని ఫుల్-టాస్‌గా వేయగా.. దానిని జైస్వాల్ డీప్ స్క్వేర్ లెగ్ మీద సిక్సర్‌గా మలిచాడు. అయితే.. ఆ బంతి నో-బాల్ కావడంతో భారత్‌కు ఫ్రీ-హిట్ వచ్చింది.అదే ఊపులోనే జైస్వాల్ తర్వాతి బంతినీ సిక్సర్‌గా మార్చాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఓ లీగల్ డెలివరీలో 12 పరుగులు (నో-బాల్‌తో కలిపితే 13) చేసిన ఏకైక క్రికెటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. చివరి టీ20లో భారత్ 42 పరుగులతో ఘనవిజయం సాధించింది.ఈ విజయంతో భారత్ 4-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది. వైరల్ వీడియోపై వివరణ ఇచ్చిన హర్భజన్ సింగ్, ఎవరి మనసులు అయినా గాయపడి ఉంటే చింతిస్తున్నామని వెల్లడి
Here's Video
.@ybj_19 started the final T20I of the Zimbabwe tour with a flourish 💥💥#SonySportsNetwork #ZIMvIND #TeamIndia | @BCCI pic.twitter.com/7dF3SR5Yg1
— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 15, 2024 10:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

