Viral Video: నవీన్-ఉల్-హక్ ను ఆటపట్టిస్తూ ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ అభిమానుల నినాదాలు.. వీడియో వైరల్
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్-ఉల్-హక్ గొడవపడ్డప్పటి నుంచి ఐపీఎల్ 2023 పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఈమార్పులకు ముఖ్యంగా ఇరువైపుల అభిమానులు తోడయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు అవకాశం రాగానే మైదానంలో గంభీర్, నవీన్ ఉల్ హక్‌లపై నినాదాలు చేస్తున్నారు.
Newdelhi, May 21: విరాట్ కోహ్లీ (Virat Kohli), గౌతమ్ గంభీర్ (Gautham Gambhir), నవీన్-ఉల్-హక్ (Naveen-ul-Haq) గొడవపడ్డప్పటి నుంచి ఐపీఎల్ 2023 పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఈమార్పులకు ముఖ్యంగా ఇరువైపుల అభిమానులు తోడయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు అవకాశం రాగానే మైదానంలో గంభీర్, నవీన్ ఉల్ హక్‌లపై నినాదాలు చేస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్ లో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో నవీన్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కొందరు అభిమానులు విరాట్ కోహ్లీ పేరుతో నినాదాలు చేస్తూ ఆటపట్టించే ప్రయత్నం చేశారు. అయితే, నవీన్ కూడా తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని, తన చేతితో సైగలు చేసి, నినాదాలు చేయడం కొనసాగించమని వారిని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Eden Gardens crowd chanting 'Kohli, Kohli' on Naveen Ul Haq bowling. pic.twitter.com/WjibEQbiNr
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 21, 2023 08:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

