IPL 2022: రెండుసార్లు అదే యార్కర్‌కు బలైన జోస్ బట్లర్, లాకీ పెర్గూసన్ తెలివైన బౌలింగ్‌తో బట్లర్‌ను బోల్తా కొట్టించిన వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ మంచి ఊపు మీదున్నాడు. ప్రస్తుతం 5 మ్యాచుల్లో 272 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ కొట్టేశాడు.తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆరంభంలో బట్లర్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు. కేవలం 23 బంతుల్లోనే అతను 50 రన్స్ చేశాడు.
ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ మంచి ఊపు మీదున్నాడు. ప్రస్తుతం 5 మ్యాచుల్లో 272 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ కొట్టేశాడు.తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆరంభంలో బట్లర్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు. కేవలం 23 బంతుల్లోనే అతను 50 రన్స్ చేశాడు. అయితే పేస్ బౌలర్ లాకీ పెర్గూసన్ తెలివైన బౌలింగ్‌తో బట్లర్‌ను బోల్తా కొట్టించాడు. ఆరవ ఓవర్ అయిదో బంతిని బట్లర్ సిక్సర్‌గా మలిచాడు. ఇక ఆరో బంతిని ఫెర్గూసన్ చాలా తెలివిగా వేశాడు. స్లో లెగ్ కటర్‌తో బట్లర్‌ను ఖంగుతినిపించాడు. ఇదే టోర్నీలో జరిగిన ఓ మ్యాచ్‌లోనూ బట్లర్ ఇలాగే స్లో యార్కర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిచర్డ్‌సన్ వేసిన స్లో బంతిని బట్లర్ అంచనా వేయలేక ఔటయ్యాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్‌పై 37 రన్స్ తేడాతో గుజరాత్ జట్టు గెలిచింది.
Jos Buttler X Slower ball pic.twitter.com/m0qkktCk4c
— Mohammed Asif (@Klassy__KL) April 14, 2022
Two exact similar incoming slow deliveries, Buttler got bowled to J Richardson and Ferguson.. pic.twitter.com/l8Q0WYJ5DK
— Muthu kumar.. (@MuthukJo) April 14, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 15, 2022 11:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

