IPL 2023: రూ. 13.25 కోట్లు ఎందుకు బ్రో, ఏ స్థానంలో వచ్చిన చెత్తగా ఆడి వెళుతున్నావు, హ్యారీ బ్రూక్ వరుస వైఫల్యాలపై మండిపడుతున్న SRH అభిమానులు
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వరుస వైఫల్యాల కథ కొనసాగుతుంది.రూ. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్రూక్ ఆ తర్వాత జరిగిన ప్రతి మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్ నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్ వచ్చినా అదే ఆటతీరు కనబరుస్తున్నాడు.

నిన్న కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ నాలుగో స్థానంలో వచ్చి డకౌట్ అయ్యాడు. అయితే ఇదే కేకేఆర్‌పై ఈ సీజన్‌లో సెంచరీ మార్క్ అందుకున్న బ్రూక్ ఈసారి మాత్రం చెత్తగా ఔట్ అయ్యాడు. స్పిన్ ఆడడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు మరోసారి దొరికిపోయాడు.
అనుకుల్ ఫుల్‌లెంగ్త్ డెలివరీ వేయగా.. బ్రూక్ అడ్డుకునే ప్రయత్నంలో ప్యాడ్లకు తాకింది. దీంతో ఎల్బీగా వెనుదిరిగాడు. బ్రూక్ ఆటతీరుపై అభిమానులు మరోసారి ట్రోలింగ్‌కు దిగారు. ''ఏ స్థానంలో వచ్చినా అదే ఆటతీరు..ఇక ఆడించింది చాలు.. బెంచ్‌కు పరిమితం చేయడం మేలనుకుంటా'' అని కామెంట్లు చేస్తున్నారు.
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 05, 2023 01:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).