బంగ్లాదేశ్‌ సాధారణ ఎన్నికలలో పోటీచేసి అధికార అవామీ లీగ్‌ పార్టీ తరఫున గెలిచిన ఆ దేశ క్రికెట్‌ జట్టు సారథి షకిబ్‌ అల్‌ హసన్‌ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తలలో నిలిచాడు. ఎన్నికల సందర్భంగా ఓ పోలింగ్‌ బూత్‌ పరిశీలనకు వెళ్లిన షకిబ్‌.. అభిమాని చెంప చెల్లుమనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.మగుర-1 నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన షకిబ్‌.. లక్షా యాభై వేల మెజారిటీతో గెలిచాడు. షకిబ్‌ గెలిచిన తర్వాత ఈ వీడియో వైరల్‌ అవుతుండటంతో ప్రత్యర్థులతో పాటు నెటిజన్లు కూడా ఎంపీ అయినా షకిబ్‌ వ్యవహార శైలిలో మాత్రం ఏ మార్పూ రాలేదని వాపోతున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)