ఫిబ్రవరి 3, శనివారం భారత్ vs ఇంగ్లండ్ 2వ టెస్టు 2024లో 2వ రోజున జాక్ క్రాలీని ఔట్ చేయడానికి శ్రేయాస్ అయ్యర్ సంచలన క్యాచ్‌ పట్టాడు. మంచి ఫామ్‌లో ఉన్న క్రాలీ 78 బంతుల్లో 76 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో ఫామ్ లో ఉన్న బ్యాటర్ అక్సర్ పటేల్‌ బౌలింగ్ లో దాడికి ప్రయత్నించాడు. అతని బౌలింగ్ లో హిట్టింగ్ చేయగా బంతి గాల్లోకి లేచింది. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న అయ్యర్ వెనుకకు పరుగెత్తుతూ సంచలన క్యాచ్ అందుకున్నాడు. అది భారత్‌కు ఇది చాలా అవసరమైన వికెట్. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ షేర్ చేసింది.  జస్ప్రీత్‌ బుమ్రా యార్కర్ వీడియో ఇదిగో, ఎగిరి అవతల పడిన వికెట్లు, బిత్తరపోయి అలానే చూస్తుండిపోయిన ఇంగ్లండ్ బ్యాటర్‌ ఓలీ పోప్‌

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)