Vinesh Phogat Disqualified: పార్లమెంట్‌లో వినేశ్ ఫోగట్ అనర్హత వేటు ప్రకంపనలు, ఈ అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టిన ఎంపీలు, వీడియో ఇదిగో..
ఫొగాట్‌పై అనర్హత వేటు అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ (Lok Sabha)లో లేవనెత్తారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీలు పట్టుబట్టారు. స్పందించిన ప్రభుత్వం వినేశ్ ఫొగాట్ అంశంపై ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర క్రీడా మంత్రి ప్రకటన చేస్తారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది.
ఫొగాట్‌పై అనర్హత వేటు అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ (Lok Sabha)లో లేవనెత్తారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీలు పట్టుబట్టారు. స్పందించిన ప్రభుత్వం వినేశ్ ఫొగాట్ అంశంపై ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర క్రీడా మంత్రి ప్రకటన చేస్తారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. గెలిచినా ఓడినా పతకమే, వినేశ్ అనర్హత వేటు వెనుక అసలేం జరిగింది, మరిన్ని వివరాలు చెప్పేందుకు నిరాకరించిన ఐఓఏ
ఫైనల్లో గెలిచినా ఓడినా భారత్‌కు పతకం వచ్చేది. కానీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. అనర్హత కారణంగా ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయింది. ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్ వినేశ్‌పై అనర్హత ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఇంతకుమించి ఐఓఏ మరేమీ చెప్పలేదు. అయితే వినేశ్ ప్రతిభకు గౌరవం ఇవ్వాలని, చేతిలో మిగిలి ఉన్న మిగతా గేమ్‌లపై తాము దృష్టి సారిస్తున్నామని ఐఓఏ తెలిపింది.
Here's Video
#WATCH | Delhi: Opposition MPs raise the issue of disqualification of Indian wrestler Vinesh Phogat from #ParisOlympics2024, in Lok Sabha
Union Minister Arjun Ram Meghwal says, 'Union Sports Minister will give a statement on this matter at 3 pm today." pic.twitter.com/kFqle3uSQc
— ANI (@ANI) August 7, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 07, 2024 01:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

