Vinesh Phogat

Vinesh Phogat hospitalised in Paris: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది.  వినేశ్.. మీరు ఛాంపియన్లలో ఛాంపియన్, వినేశ్‌ ఫోగాట్‌ అనర్హత వేటుపై స్పందించిన ప్రధాని మోదీ, ఇంకా ఏమన్నారంటే..

ఫైనల్లో గెలిచినా ఓడినా భారత్‌కు పతకం వచ్చేది. కానీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. అనర్హత కారణంగా ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయింది. ఇండియన్‌ ఒలింపిక్‌ అసోషియేషన్‌ వినేశ్‌పై అనర్హత ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఇంతకుమించి ఐఓఏ మరేమీ చెప్పలేదు. అయితే వినేశ్‌ ప్రతిభకు గౌరవం ఇవ్వాలని, చేతిలో మిగిలి ఉన్న మిగతా గేమ్‌లపై తాము దృష్టి సారిస్తున్నామని ఐఓఏ తెలిపింది.