Andhra Pradesh Crime: ఏలూరులో దారుణం, కన్న కూతుర్లకు రెండో భర్తతో కడుపు చేయించిన తల్లి, ట్విస్ట్ ఏంటంటే..

ఏలూరులోని వట్లూరు గ్రామ పంచాయతీకి చెందిన ఓ వివాహిత (38) భర్త అనారోగ్యంతో 2007లో మరణించగా ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. తరువాత పుట్టా సతీష్ పవన్ కుమార్ (43) అనే యువకుడిని వివాహం చేసుకుంది

Andhra Pradesh Crime: ఏలూరులో దారుణం, కన్న కూతుర్లకు రెండో భర్తతో కడుపు చేయించిన తల్లి, ట్విస్ట్ ఏంటంటే..
Representational Image | (Photo Credits: IANS)

ఏలూరులోని వట్లూరు గ్రామ పంచాయతీకి చెందిన ఓ వివాహిత (38) భర్త అనారోగ్యంతో 2007లో మరణించగా ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. తరువాత పుట్టా సతీష్ పవన్ కుమార్ (43) అనే యువకుడిని వివాహం చేసుకుంది. ఆమెకు సంతానం కలగదని భావించిన సతీష్ కుమార్ మరో మహిళ ద్వారా సంతానం పొందుతానని చెప్పడంతో.. ఆమె తన ఇద్దరు కుమార్తెలు ఈడుకొచ్చారని, వారి ద్వారా సంతానం పొందాలని సూచించింది. పెద్ద కుమార్తె 8వ తరగతి చదువుతున్న సమయంలో కన్న తల్లి ఆమెను సతీష్ కుమార్ వద్దకు పంపించింది.

ఆ చిన్నారి ప్రతిఘటించినా వారిద్దరూ కలిసి చావబాదారు. ఆమె గర్భం దాల్చడంతో చదువు ఆగి, అందరికీ తెలిసిపోతుందని భయపడి అబార్షన్ చేయించారు. చివరకు పదో తరగతిలోకి రావడంతో మరోసారి ఆ విద్యార్థినిని గర్భవతిని చేశారు. 2021 జూన్ 3న పాప జన్మించింది. అయితే మగ బిడ్డ కావాలని సతీష్ చెప్పడంతో ఈసారి తన రెండో కుమార్తె (16)ను పంపింది. ఆమె కూడా గర్భం దాల్చ డంతో ఇంటిలోనే డెలివరీ చేశారు. ప్రాణం లేని మగశిశువు పుట్టడంతో ఆ బిడ్డను కాలువలో పడవేశారు.

ఇటీవల సతీశ్‌కు, ఆమెకు గొడవలు రావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లి పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు పెట్టింది. విషయం మేనమాకు తెలిసి.. బుధవారం ఏలూరు చేరుకుని ఆడపిల్లలిద్దరినీ తీసుకుని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వీరి బండారం అంతా బయటపడింది. ప్రస్తుతం పెద్ద కుమార్తె మూడో నెల గర్భిణి అని పోలీసులు గుర్తించారు.

mother handed over Two Daughters to her second husband for pregnancy (Photo-Twitter)

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 14, 2023 01:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).