Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, ఓటరు చెంప చెళ్లుమనిపించిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే, ఎదురు తిరిగి ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన ఓటరు
తెనాలి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఓటరు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెనాలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఓటేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చారు. అప్పటికే క్యూలో ఉన్న జనాలను పట్టించుకోకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళుతున్నారు.
తెనాలి ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఓటరు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెనాలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఓటేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చారు. అప్పటికే క్యూలో ఉన్న జనాలను పట్టించుకోకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళుతున్నారు. ఇది చూసి అక్కడ ఉన్న ఒక ఓటరు అభ్యంతరం చెప్పారు. అందరితో పాటు క్యూలో రావాలని సూచించారు. దీంతో ఆవేశానికి లోనైన ఎమ్మెల్యే శివకుమార్ ఆ ఓటర్ పై చేయిచేసుకున్నారు. ఓటర్ తిరిగి కొట్టడంతో ఎమ్మెల్యే అనుచరులు మూకుమ్మడిగా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బ్లూ షర్టుతో ఓటేయడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, సోషల్ మీడియాలో ఖుషీ అవుతున్న వైసీపీ ఫ్యాన్స్, వీడియోలు ఇవిగో..
Here's Video
Ruling Tenali YSRCP MLA Annabathuni Siva Kumar lost his temper and slapped a voter in the polling booth. The voter slapped him back. Caught in a camera.#YSRCP #AnnabathuniSivaKumar #Tenali #APElection2024 #Voter #AndhraPradeshElections2024 pic.twitter.com/bAAftXVQad
— Surya Reddy (@jsuryareddy) May 13, 2024
ఒకరిని ఒకరు కొట్టుకున్న ఎమ్మెల్యే మరియు ఓటర్
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ క్యూలో వెళ్లకుండా నేరుగా ఎలా వెళ్తావని నిలదీసిన ఓటర్.
ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే శివకుమార్ ఓటరు చెంపపై కొట్టాడు.. దీంతో ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. pic.twitter.com/6f23YW3X9c
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 13, 2024 11:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

