ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ టాలీవుడ్ హారోలు జూనియర్ ఎన్టీఆర్‌, మహేష్ బాబు బ్లూ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇద్దరు హీరోలు బ్లూ షర్ట్స్ ధరించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. దీంతో ఎన్టీఆర్‌, మహేష్ బాబు పరోక్షంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.తమకు మద్దతుగానే ఎన్టీఆర్‌ బ్లూషర్ట్‌ వేసుకొచ్చాడంటూ వైఎస్సార్‌సీపీ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఇద్దరి ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ తన కుటుంబ పార్టీ అయిన టీడీపీతో పాటు ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ 42 లోక్‌ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభమైంది.సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)