తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచక దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. తలుపులు బద్ధలు కొట్టారు. వైఎస్సార్‌సీపీ, కార్యకర్తలను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు. పోలీసుల దాష్టీకంపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. తాడిపత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎస్పీ అమిత్ బర్దర్‌పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. పోలీసుల ఏకపక్ష వైఖరిని వైఎస్సార్‌సీపీ లీగల్‌ తప్పుబట్టింది. తాడిపత్రిలో పోలీసుల అరాచకంపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించారు. వీడియో ఇదిగో, తాడిపత్రిలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి, చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)