ఏపీలో సాధారణ ఎన్నికల పోలింగ్‌ ముగిసినా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మంగళవారం(మే14) తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడికి దిగగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయలవగా ఆస్పత్రికి తరలించారు.  చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దుండుగుల దాడి, పరిస్థితి అదుపులోనే ఉంది, నిందితులను అరెస్టు చేస్తామని తెలిపిన ఎస్పీ

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)