ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా లేవని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని గురువారం తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ సందేశం పోస్ట్ చేశారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయి. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెప్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?’’ అని వైఎస్ జగన్ విమర్శించారు. వీడియోలు ఇవిగో, తాడిపత్రిలో ఉద్రిక్తత, పెద్దారెడ్డి ఇంటిపై జేసీ వర్గీయులు దాడి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి బయటకు పంపించిన పోలీసులు
తాడిపత్రిలో టీడీపీ దాడులపై ఎస్పీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు వినతి పత్రం అందజేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆంక్షలు తొలగించాలని మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.జేసీ కుటుంబం అరాచకాలపై తాడిపత్రి వైఎస్సార్‌సీపీ నేత కందిగోపుల మురళి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం జేసీ వర్గీయులు తమ ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారని ధ్వజమ్తెతారు. వీడియో తీస్తుంటే మావాళ్ల ఫోన్లను లాక్కున్నారంటూ.. దాడి ఘటనను ఆయన వివరించారు.
Here's Tweet
ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. వైయస్సార్సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయి. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే,… pic.twitter.com/Bx35uodt4P
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)