జపాన్‌లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సనై టకైచి దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (LDP) అధ్యక్షురాలిగా ఉన్న తకైచి, పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో పదవీ విరమణ చేసిన షిగెరు ఇషిబాకు తరువాత ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ మెజార్టీ కోల్పోవడం, ఇషిబాపై ఒత్తిడిని పెంచింది. దీంతో ఆయన రాజీనామా చేశారు.తదనంతర పరిణామాల మధ్య శనివారం జరిగిన పార్టీ ఎన్నికల్లో తకైచి.. మాజీ ప్రధాన మంత్రి కుమారుడు షింజిరో కోయిజుమి, మరి కొందరు అభ్యర్థులను ఓడించి LDP అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

నేడు పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో టకైచి భారీ మద్దతు పొందారు. దీంతో జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన ఘనత సాధించారు. 64 ఏళ్ల టకైచి 1993లో నారా నుండి పార్లమెంటులో ప్రవేశించి ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వం వంటి కీలక విభాగాలలో పనిచేశారు. ఆమె ఎన్నిక ద్వారా జపాన్‌లో మహిళా నాయకత్వానికి పెద్దగా అవకాశాలు కల్పించబడిన ఘనతను సృష్టించింది.

వీడియో ఇదిగో, శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ, భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, నేడు రూ. 13,429 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

జపాన్ ప్రధానిగా ఎన్నికైన టకైచికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో, ఇన్‌డో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు సాధించడంలో తకైచితో కలిసి పని చేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు.

Sanae Takaichi Becomes First Female Prime Minister of Japan

India PM Modi Wishes

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)