Congress Chalo Secretariat Protest: షర్మిల అరెస్ట్, వెంటనే విడుదల, ఒక్కహామీని నెరవేర్చని జగన్ వైఎస్‌ఆర్ వారసుడినని ఎలా ప్రకటించుకుంటారని మండిపాటు
మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది
మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. షర్మిలతో పాటు కార్యకర్తలు, నాయకులను దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సీఎం జగన్ మడత పెట్టేశారని షర్మిల ఆరోపించారు. 151 సెక్షన్ కింద సంతకాలు తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఆమెను పంపించేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిన జగన్.. వైఎస్‌ఆర్ వారసుడినని ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను భర్తీ చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే తిరిగి సొంతగూటికి చేరుకోవడంపై శుక్రవారం స్పందిస్తానని చెప్పారు. 23 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి 6 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు, మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారంటూ షర్మిల నిరసన
Here's Video
BIG BREAKING
చలో సెక్రటేరియట్‌కి బయలు దేరిన APCC అధ్యక్షురాలు షర్మిలా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.
విజయవాడ - ఉండవల్లి వద్ద అరెస్ట్.. పరిస్థితి ఉద్రిక్తం దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కి తరలింపు. pic.twitter.com/H3IVCDPYQV
— Telugu Scribe (@TeluguScribe) February 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 22, 2024 05:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

