మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహా నేతలను పోలీసులు పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లోనే హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల బైఠాయించి నిరసన తెలిపారు.
షర్మిల మాట్లాడుతూ..వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా నిలబడితే అరెస్టు చేస్తున్నారు. మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే. 23వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి.. కేవలం 6 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Here's Videos
The @INC_Andhra chief YS Sharmila Reddy along with other #Congress leaders and party workers sit in protest against her brother #YSJagan led #YSRCP govt at Andhra Ratna Bhavan, APCC HQ, ahead of #ChaloSecretariat protest.#AndhraPradesh #YSSharmila #AndhraPradeshElections2024 pic.twitter.com/lTHhmj8cfD
— Surya Reddy (@jsuryareddy) February 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)