నేపాల్ దేశంలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో 20 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్ర పరిస్థితిని చూసి ప్రభుత్వం తక్షణమే సోషల్ మీడియాపై నిషేధాన్ని తొలగించింది. అయినా, ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు.

తీవ్ర ఆగ్రహంతో ఆందోళనకారులు మంత్రులు, రాజకీయ నాయకుల, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ్ ఇంటిపై దాడులు జరిపారు. ఇళ్లను లూటీ చేసి, నోట్ల కట్టలు గాలిలో విసిరే దాకా పరిస్థితి తీవ్రతరం అయింది. ప్రధాని కె.పి. శర్మ ఓలి అధికారిక నివాసంలోకి చొరబడిన ఆందోళనకారులు ఆస్తులను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. ఇదే సమయంలో, నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ అధికారిక నివాసంపై కూడా దాడి జరిగింది.

ఈ అనిశ్చిత పరిస్థితిల మధ్య సైన్యం సూచన మేరకు ప్రధాని కె.పి. శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నెపాల్‌లో కొత్త ప్రధాన మంత్రి ఎవరో ఈ సాయంత్రం ప్రకటించనున్నట్లు వార్తలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితిని నియంత్రించేందుకు అన్ని ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు.

KP Sharma Oli Resigns As Nepal Prime Minister

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)