తొలి ఖోఖో ప్రపంచకప్‌(Kho Kho World Cup 2025) విజేతగా భారత్‌ మహిళల జట్టు అవతరించింది. ఈ ప్రపంచకప్‌లో ఆది నుంచి చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్‌(Nepal) జట్టును ఓడించింది.ఈ విజయంతో తొలి ఖోఖో ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది.

ఖోఖో వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌, మహిళలు, పురుషుల విభాగాల్లోనూ ప్రపంచకప్‌ భారత్‌ సొంతం

కీలకమైన ఫైనల్లో టాస్‌ గెలిచిన నేపాల్‌.. ముందుగా భారత్‌ ను అటాక్‌ రమ్మని ఆహ్వానించింది. ఇది ఆతిథ్య భారత్‌కు వరంగా మారగా, పర్యాటక జట్టు నేపాల్‌కు శాపంగా మారింది. ఆది నుంచి రెచ్చిపోయిన భారత జట్టు. నేపాల్‌ను వరుస విరామాల్లో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఎక్కడా కూడా నేపాల్‌కు అవకాశం ఇవ్వకుండా భారత్‌ తన ఆధిపత్యాన్నిప్రదర్శించింది. చివరి దాకా ఇదే ఆట తీరుతో చెలరేగిపోయిన భారత జట్టు.. నేపాల్‌ను మట్టికరిపించి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)