India Men's Kho Kho Team in Action (Photo Credits: @Kkwcindia/X)

New Delhi, JAN 19: ఖోఖో మహిళల ప్రపంచకప్‌ను (Kho Kho World Cup) సొంతం చేసుకున్న భారత్‌.. అదే జోరు కొనసాగించి.. పురుషుల ప్రపంచ కప్‌ను కూడా కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా నేపాల్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో (Kho Kho World Cup Final) పురుషుల జట్టు విజయఢంకా మోగించింది. 54-36 తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. తొలి రౌండ్‌లో 26 -18 ఆధిక్యంతో నిలిచిన భారత్‌ అదే జోరును చివరి వరకు కొనసాగించింది. మూడో రౌండ్‌ ముగిసే సమయానికి 56-18 లీడ్‌లోకి వెళ్లింది.

India Men's Team Wins Kho Kho World Cup 2025

 

అయితే, నాలుగో రౌండ్‌లో అటాకింగ్‌కు దిగిన నేపాల్‌ 37 పాయింట్లు సాధించాల్సి ఉండగా.. కేవలం మరో 18 పాయింట్లు మాత్రమే రాబట్టగలిగి 36 వద్ద చేతులెత్తేసింది. దీంతో భారత్‌ కప్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఇక్కడ మహిళల, పురుషుల ప్రత్యర్థి జట్లు నేపాల్‌వే కావడం గమనార్హం