నేపాల్ దేశంలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలల వ్యక్తమవుతున్నాయి. హింసాత్మక నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి ఇటీవల రాజీనామా చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కూడా రాజీనామా చేశారు. నిరసనకారులు అధ్యక్షుడి అధికారిక నివాసాన్ని ముట్టడించి, దానిని ధ్వంసం చేశారు. విలువైన వస్తువులు దోచుకోవడంతో అక్కబ చట్ట విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, ఓలి ప్రైవేట్ నివాసంపై కూడా దాడి చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇది సంక్షోభాన్ని మరింత గాఢతరం చేసింది.ఈ రాజకీయ కలవరానికి కారణాలు ఏంటంటే.. అవినీతిపై ప్రజల పెరుగుతున్న ఆగ్రహం, వాక్ స్వాతంత్య్రంపై ప్రభుత్వం విధించిన పరిమితులు. నేపాల్ అగ్ర నాయకుల జంట రాజీనామాలు దేశాన్ని అత్యంత అనిశ్చిత పరిస్థితికి నెట్టాయి. ప్రస్తుతం దేశంలో భవిష్యత్ రాజకీయ మార్గదర్శకత్వంపై తీవ్రమైన సందేహాలు కొనసాగుతున్నాయి.

Nepal President Ram Chandra Poudel Resigns Amid Violent Protests Over Social Media Ban

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)