Andhra Pradesh: వీడియో ఇదిగో, జగన్ ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం, కొవ్వూరులో యువకుడు హల్ చల్

అసెంబ్లీ ఎన్నికల్లో వైఎసీపీకి అధిక ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణ గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీతో కొవ్వూరు గామన్ బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని.. పోలీసు అధికారులు వస్తే దూకేస్తానని హల్ చల్ చేశాడు

Andhra Pradesh: వీడియో ఇదిగో, జగన్ ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం, కొవ్వూరులో యువకుడు హల్ చల్
Kovvur Man Says I will commit suicide if there is no inquiry into why Jagan Mohan Reddy lost in Elections Watch Video

కొవ్వూరు - అసెంబ్లీ ఎన్నికల్లో వైఎసీపీకి అధిక ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణ గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీతో కొవ్వూరు గామన్ బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని.. పోలీసు అధికారులు వస్తే దూకేస్తానని హల్ చల్ చేశాడు. ఘటనపై సకాలంలో స్పందించిన పోలీసులు వారిని అడ్డుకొని నచ్చజెప్పారు.  వీడియో ఇదిగో, ఐ ప్యాక్ వల్లే మాకు ఘోర పరాజయం, తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సంచలన వ్యాఖ్యలు

జగన్ ఓడిపోవడంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందని ఈ వీడియో ద్వారా రాష్ట్రపతికి తెలియజేయాలని వైయస్సార్ అభిమాని రాజు ఆవేదన చెందారు. రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకి తన కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశారు. ఇప్పటికిప్పుడు మళ్లీ ఎలక్షన్ జరపాలని ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరిగితే జగనన్నే అధిక మెజారిటీతో గెలుస్తాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కొవ్వూరు పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులను క్షేమంగా ఇంటికి చేర్చారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 11, 2024 12:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).