సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఐపాక్ సంస్థ వల్ల నష్టం జరిగిందన్నారు. చాలా మంది నేతలు, కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. గతంలో లగడపాటి టీడీపీని ముంచినట్లు ఇప్పుడు ఆరా మస్తాన్ సైతం వైసీపీని ముంచాడన్నారు.
దాదాపు 3 దశాబ్ధాల పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన స్వామిదాసు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైసీపీలో చేరారు . 1994, 99 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు నల్లగట్ల స్వామిదాసు. తెలుగుదేశం అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. పోలీసు కస్టడీలో నన్ను చిత్రహింసలకు గురి చేశారు, జగన్ మీద హత్యాయత్నం కేసు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సైతం రెండు రోజుల క్రితం ఐపాక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపాక్ ఓ పనికి మాలిన సంస్థ అని..అందులో ఉన్న వారంతా డిగ్రీలను అడ్డుకుని జగన్‌ను తప్పుదోవ పట్టించారన్నారు. ఆ సంస్థను నమ్మి ఎన్నికల్లో ఓడిపోయామన్నారు.
Here's Video
YSRC MLA candidate blames I PAC for losses
MLA candidate Nallagatla Swamidasu addresses YCRC leaders in Thiruvuru: "We faced financial setbacks in the elections. Mistakes were made, and the iPac team deceived us. Aara Mastan's also gave wrong reports ." #YSRC… pic.twitter.com/euorrHgHlv
— Sudhakar Udumula (@sudhakarudumula) June 10, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)