ఏపీలో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది.ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ రూపంలో మళ్లీ పాత విధానం అమలులోకి వచ్చింది. తాజాగా మద్యం అమ్మకాలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా వెలిసిన బెల్ట్ షాపులు వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు.తిరువూరు టౌన్‌లో అధికారికంగా నాలుగు మద్యం షాపులు ఉంటే 40 బెల్ట్ షాపులు దీనికి అదనంగా నడిపిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో 135 బెల్ట్ షాపులు ఏర్పాటయ్యాయని తెలిపారు.

వీడియో ఇదిగో, సుప్రీంకోర్టు దుర్మార్గమైన తీర్పు ఇచ్చింది, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

ఈ మద్యం దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. తిరువూరు నియోజకవర్గంలో 48 గంటల్లో బెల్ట్ షాపులన్నీ సీజ్ చేయకపోతే నేనే ప్రత్యక్షంగా రంగంలో దిగి నేనె వాటిని సీజ్ చేస్తానని ఎక్సైజ్ అధికారులకు డెడ్లైన్ విధించారు. కాగా ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 236 మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. క‌ృష్ణా- 123, ఎన్టీఆర్- 113 లిక్కర్ షాపులు ఉన్నాయి.

MLA Kolikipudi Srinivasa rao ob belt Shops

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)