ఎన్టీఆర్‌ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి మరో దెబ్బ తగిలింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం సాయంత్రం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో స్వామిదాస్‌కు కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌. స్వామిదాస్‌తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు.  ఇక నుంచి జగన్‌తోనే నా ప్రయాణం, ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు, తనను టీడీపీ నేతలు గొట్టంగాడు అన్న భరించానని ఆవేదన

ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వామిదాస్‌ 1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఖాళీ కావడం ఖాయమంటూ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)