మాచర్ల మున్సిపాలిటీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 16 మంది వైసీపీ కౌన్సిలర్లు తాజాగా టీడీపీలో చేరారు.దీంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరింది. మాచర్ల మున్సిపల్ చైర్మన్ చిన్న ఏసోబు వారం కిందటే రాజీనామా చేయగా... వైస్ చైర్మన్ పోలూరు నరసింహారావును నేడు చైర్మన్ గా ఎన్నుకున్నారు.

ఈ క్రమంలో పోలూరు నరసింహారావు చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. పోలూరు నరసింహారావు ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డులు ఉండగా... ఇటీవలే 14 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తాజాగా 16 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో టీడీపీకి ఎదురులేకుండా పోయింది. గత ఎన్నికలలో 31 కౌన్సిలర్ల సీట్లు ఉన్న మాచర్ల మున్సిపాలిటీ ని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ.   రెడ్‌ బుక్‌ మీద పెట్టిన శ్రద్ధ వీటిపై పెట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదు, అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ మండిపాటు

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)