Harsha Kumar Slams CM Chandrababu: వీడియో ఇదిగో, జగన్ ని చూసి నేర్చుకో.. నీవు చేతకాని దద్దమ్మ, అసమర్ధ ముఖ్యమంత్రివి, సీఎం చంద్రబాబుపై మండిపడిన మాజీ ఎంపీ హర్ష కుమార్

సూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హర్ష కుమార్ మండిపడ్డారు. 15ఏండ్ల పాటు సీఎంగా వ్యవహరించి చంద్రబాబు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అలవాటుగా మారిందన్నారు.

Harsha Kumar Slams CM Chandrababu: వీడియో ఇదిగో, జగన్ ని చూసి నేర్చుకో.. నీవు చేతకాని దద్దమ్మ, అసమర్ధ ముఖ్యమంత్రివి, సీఎం చంద్రబాబుపై మండిపడిన మాజీ ఎంపీ హర్ష కుమార్
Harsha Kumar Slams CM Chandrababu (Photo-FB)

సూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హర్ష కుమార్ మండిపడ్డారు. 15ఏండ్ల పాటు సీఎంగా వ్యవహరించి చంద్రబాబు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అలవాటుగా మారిందన్నారు. 2014లో జగన్ రైతు రుణమాఫీ చేయలేనని చెప్పగా..నీవు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారని..అప్పుడు కేంద్రంతో పొత్తు అని చెప్పి తర్వాత యూటర్న్ తీసుకోవడం..రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు, పోలవరం అంశాలలో విఫలమై 2019వరకు రాష్ట్రానికి విఫల సీఎంగా మిగిలారన్నారు.

వీడియో ఇదిగో, మీ తండ్రి లేకపోతే నువ్వో పెద్ద సుద్ద పప్పువి, నారా లోకేష్ మీద విరుచుకుపడిన అంబటి రాంబాబు

మీరు పసుపు కుంకుమను పెంచేసి ఖాళీ ఖజనా జగన్ కు కట్టబెట్టి పోయినప్పటికి..జగన్ తను చెప్పిన సంక్షేమ పథకాలను ఐదేళ్ల పాటు నిరాటంకంగా సమర్థవంతంగా అమలు చేశారన్నారు. అంటే మీరు గొప్ప పాలకుడా లేక జగన్ గొప్ప పాలకుడా అని చెప్పాలంటే జగన్ సమర్థవంతమైన పాలకుడని తేలిపోయిందన్నారు. చంద్రబాబు కంటే పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ అగ్రభాగాన ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో..అడ్డగోలు హామీలు ఇవ్వకుండా ఉండటంలో జగన్ ను చూసి చంద్రబాబు నేర్చుకోవాల్సిందేనన్నారు.

Harsha Kumar Slams CM Chandrababu: 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 28, 2025 05:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).