విజయవాడ వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రలు బయటపడకుండా ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్‌ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. వీడియో ఇదిగో, విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో సస్పెండ్, ఆహారం అందలేదని ప్రశ్నించినందుకు చెంప పగలగొట్టిన జయలక్ష్మి

‘‘అధికారం అండతో సైకో జగన్‌ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపారు. 5 ఊళ్లను నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్‌ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొని కూల్చేయాలని కుట్ర చేశారు. విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాల నామరూపాలు లేకుండా చేసి లక్షల మంది జలసమాధి అయ్యేలా జగన్‌ పన్నిన కుట్ర బట్టబయలైంది. దీన్ని ప్లాన్‌ చేసింది సైకో జగన్‌ అయితే.. అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)