Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో సస్పెండ్, ఆహారం అందలేదని ప్రశ్నించినందుకు చెంప పగలగొట్టిన జయలక్ష్మి

విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మి తీరుపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ సృజన వెల్లడించారు. ఆమెకు షోకాజ్‌ నోటిసులు ఇచ్చినట్లు తెలిపారు.

Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో సస్పెండ్, ఆహారం అందలేదని ప్రశ్నించినందుకు చెంప పగలగొట్టిన జయలక్ష్మి
VRO Suspended Who hit the flood victim on the cheek

విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మి తీరుపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ సృజన వెల్లడించారు. ఆమెకు షోకాజ్‌ నోటిసులు ఇచ్చినట్లు తెలిపారు. మంచినీరు, ఆహారం తమ వీధిలోకి అందలేదని విజయవాడలో వరద బాధితులు ప్రశ్నించినందుకు వీఆర్వో జయలక్ష్మి ఒకరి చెంప పగలగొట్టారు. అక్కడితో ఆగకుండా పోలీసులు ముందే బాధితుడిని దుర్భాషలాడారు. నన్నే ప్రశ్నిస్తావా?అంటూ బాధితులపైనే అధికారులకు ఫిర్యాదు చేశారు.  వీడియో ఇదిగో, భారీ వరదలకు ఉదృతంగా ప్రవహిస్తోన్న కొండ కాలువ, గర్భిణిని ట్రాక్టర్‌పై వాగు దాటించిన గిరిజనులు

భోజనాలు, మంచినీరు అందటం లేదని ప్రశ్నించినందుకు ఇలా ఓ వీఆర్వో, వరద బాధితులపై చేయి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. ఆమె వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 09, 2024 07:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).