ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. అక్కడ కొండ కాలువ పొంగి పొర్లుతోంది.రంపచోడవరం మండలం చెరువు నిమ్మలపాలెం వద్ద కొండ కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది. వై.రామవరం మండలం చామగడ్డ పంచాయితీ పనసల పాలెం-పలకజీడి కల్వర్ట్ పైనుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అక్కడ పురిటి నొప్పులతో ఉన్న గర్భిణిని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు గ్రామస్తులు ట్రాక్టర్‌పై వాగు దాటించారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. బుడమేరు’ పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్.. ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారుల హెచ్చరిక
Here's Video
పొంగిన కొండ కాలువ.. గర్భిణిని ట్రాక్టర్‌పై వాగు దాటించిన గిరిజనులు
అల్లూరి సీతారామరాజు జిల్లా: రంపచోడవరం మండలం చెరువు నిమ్మలపాలెం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న కొండ కాలువ.
వై.రామవరం మండలం చామగడ్డ పంచాయితీ పనసల పాలెం-పలకజీడి కల్వర్ట్ పైనుంచి వరద ప్రవాహం.. పలు గ్రామాలకు రాకపోకలు… pic.twitter.com/BLctRDipYu
— BIG TV Breaking News (@bigtvtelugu) September 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)