ఇంజక్షన్ వికటించి 7 నెలల గర్భిణి మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం(Andhra Pradesh) నోబుల్ కాలేజీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మృతురాలు పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన కట్టా దుర్గా మల్లేశ్వరి(27).

జనరల్ చెకప్ కోసం నిన్న ఆసుపత్రికి వెళ్లారు మల్లేశ్వరి(Pregnant Woman Dies). ఉమ్ము నీరు తక్కువగా ఉండటంతో టెస్టులు చేసి ఇంజక్షన్ ఇచ్చారు వైద్యురాలు. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మృతి చెందింది గర్భిణి మల్లేశ్వరి. దీంతో ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు.

వీడియో ఇదిగో, ఆన్ లైన్ బెట్టింగులతో మోసపోయానంటూ పెన్షన్ డబ్బులతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్ సెల్ఫీ వీడియో, నెలరోజులలో డబ్బులు చెల్లిస్తాను అని వెల్లడి

ఇక మరో వార్తను చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోని ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ ప‌రిధిలోని స‌చివాల‌యం-3లో వెల్ఫేర్ అసిస్టెంట్ సంప‌త్ ల‌క్ష్మీ ప్రసాద్ పెన్షన‌ర్లకు ఇవ్వాల్సిన రూ.8.43 ల‌క్షల‌ డ‌బ్బులతో ప‌రార‌యిన సంగతి విదితమే. తాజాగా అతను సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తను ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో చాలా డబ్బులు పోగొట్టుకున్నానని దీనితో అప్పులయ్యాయని వెళ్లడించాడు.

Pregnant Woman (7 Months) Dies Due to Injection Reaction..!

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)