Kolleru Lake: బుడమేరు తర్వాత దడ పుట్టిస్తున్న కొల్లేరు సరస్సు, పెరుగుతున్న వరదతో రోడ్డుపైకి వస్తున్న నీరు, భయం గుప్పిట్లో పలు లంక గ్రామాలు ప్రజలు
కొల్లేరు వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.కొల్లేరు పరివాహక ప్రాంతంలోని చిన్న అడ్లగడ్డ వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు లింకుండడంతో కొల్లేరుకు నీటి ప్రవాహం ప్రస్తుతం భారీగా వస్తోంది. బుడమేరులో రెండో గండిని పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్‌రోడ్డును నిర్మిస్తున్నారు
ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో కష్టాలు ఇంకా వీడలేదు. బుడమేరకు ఇంకా వరద కొనసాగుతోంది. ఆరు రోజులుగా విజయవాడలోని పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి.ఇప్పటికీ లోపలి ప్రాంతాలకు ఆహారం అందడం లేదు.పెరుగుతున్న వరద నీరుతో గోదావరి ప్రమాదకరంగా మారుతోంది. బుడమేరు గండ్లు పూడ్చివేతతో కొల్లేరుకు వరద ప్రవాహం ఎక్కువవుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీడియో ఇదిగో, అల్లూరి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన సోకిలేరు వాగు, 40 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
కొల్లేరు వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.కొల్లేరు పరివాహక ప్రాంతంలోని చిన్న అడ్లగడ్డ వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు లింకుండడంతో కొల్లేరుకు నీటి ప్రవాహం ప్రస్తుతం భారీగా వస్తోంది. బుడమేరులో రెండో గండిని పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్‌రోడ్డును నిర్మిస్తున్నారు. మూడో గండిని పూడ్చివేస్తే విజయవాడకు ముంపు ముప్పు తప్పనుందని చెబుతున్నారు. అయితే కొల్లేరుకు వరద పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Here's Videos
ఏలూరు జిల్లా;ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కొల్లేరు సరస్సు
చిన్నఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపై కొల్లేరు ప్రవాహం
జాతీయరహదారిపై మోకాళ్ల లోతు నీటిలో రాకపోకలకు అంతరాయం
పాదచారులు, ద్విచక్రవాహనదారులు రావద్దంటూ పోలీసుల హెచ్చరిక
ఇవాళ సాయంత్రానికి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం
భయం గుప్పెట్లో… pic.twitter.com/EbvIu3pH4T
— RTV (@RTVnewsnetwork) September 5, 2024
ముంపులో చిక్కుకున్న కొల్లేరు లంకగ్రామాలు pic.twitter.com/5UXAloMnxn
— way2news_local_telugu (@way2news_telugu) September 5, 2024
Eluru : ముంపు గుప్పిట్లో కొల్లేరు లంక గ్రామాలు - TV9
► TV9 News App : https://t.co/YOmRtQvGiN #Eluru #apfloods #tv9telugu pic.twitter.com/dM1XRrEKAg
— TV9 Telugu (@TV9Telugu) September 6, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 06, 2024 01:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

