ఏపీలో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 12,092 కరోనా పరీక్షలు నిర్వహించగా, 46 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు జిల్లాలో 11 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 134 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత కొన్నిరోజుల మాదిరే కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,751 మంది కరోనా బారినపడగా, వారిలో 23,03,361 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 661 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది మరణించారు.
#COVIDUpdates: 11/03/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,18,751 పాజిటివ్ కేసు లకు గాను
*23,03,361 మంది డిశ్చార్జ్ కాగా
*14,729 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 661#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/I0to0rcAGb
— ArogyaAndhra (@ArogyaAndhra) March 11, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)