ఏపీలో కరోనా వ్యాప్తి కనిష్టస్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 22,267 శాంపిల్స్ పరీక్షించగా, 615 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 134 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 103, కృష్ణా జిల్లాలో 102 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 2,787 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,13,827 మంది కరోనా బారినపడగా, వారిలో 22,86,575 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,550 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,702కి పెరిగింది.
#COVIDUpdates: 15/02/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,13,827 పాజిటివ్ కేసు లకు గాను
*22,86,575 మంది డిశ్చార్జ్ కాగా
*14,702 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 12,550#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/MxsAKq8lsY
— ArogyaAndhra (@ArogyaAndhra) February 15, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)