వైఎస్సార్‌సీపీ ప్లీనరీ (YSRCP Plenary) రెండు రోజుల పాటూ జరుగుతున్న సంగతి విదితమే. విజయవాడ–గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానాన్ని ప్లీనరీ నిర్వహణ కోసం అందంగా ముస్తాబు చేసింది.  ప్లీనరీకి హాజరయ్యే వారికి కోసం పసందైన వంటలు రెడీ అయ్యాయి. ఫుడ్ మెనూలో.. మటన్ థమ్ బిర్యానీ, చికెన్ రోస్ట్, ఫ్రాన్ కర్రీ, బొమ్మిడాయల పులుసు, చేపల పులుసు, కోడిగుడ్లు, చపాతి, బంగాళదుంప కర్రి, బ్రెడ్ హల్వ, తాపేశ్వరం కాజా, వెజ్ బిర్యానీ, ఉల్లి చట్నీ, పెరుగు పచ్చడి, వైట్ రైస్, అవకాయ, నెయ్యి, మునగకాయ కర్రీ, ఉలవచారు, సాంబారు, రసం, మజ్జిగ పులుసు, పెరుగు, వడియాలు, సమోసాలు, ఐస్‌క్రీమ్, ఫ్రూట్ సలాడ్ వంటి 25 రకాల వంటలు ఉన్నాయి. రెండు లక్షల 50వేలమందికి భోజనం సిద్ధం చేస్తుననారు.. మొత్తం 250 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది.

YSRCP Plenary 2022 Food Menu

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)