వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై(Attack On Mudragada House) ఓ యువకుడు దాడి చేశాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసం(Mudragada House) దగ్గర ఇవాళ ఉదయం ట్రాక్టర్ తో ఓ యువకుడు హడావుడి చేశాడు. ర్యాంపు పై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్ తో ధ్వంసం చేశాడు.

అనంతరం జై జనసేన అంటూ నినాదాలు చేశాడని స్థానికులు వెల్లడించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు(Kakinada police) యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ముద్రగడ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ముద్రగడ ఇంటిపై దాడి నేపథ్యంలో పెద్ద ఎత్తు వైసీపీ నేతలు, అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ముద్రగడను పరామర్శించారు.  రేటింగ్ కోసం లంచాలు.. NAAC సభ్యులతో సహా 10 మంది అరెస్ట్, కేఎల్‌ యూనివర్సిటీ రేటింగ్ కోసం పెద్ద ఎత్తున అవినీతి, వివరాలివే

Attack on YSRCP Leader Mudragada House, one arrested

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)