Andhra Pradesh: రేటింగ్ కోసం లంచాలు.. NAAC సభ్యులతో సహా 10 మంది అరెస్ట్, కేఎల్‌ యూనివర్సిటీ రేటింగ్ కోసం పెద్ద ఎత్తున అవినీతి, వివరాలివే

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరంలోని కేఎల్ ఈఎఫ్ యూనివర్సిటీ(KLEF University) యాజమాన్యం నిర్వాకం బయటపడింది.

Andhra Pradesh: రేటింగ్ కోసం లంచాలు.. NAAC సభ్యులతో సహా 10 మంది అరెస్ట్, కేఎల్‌ యూనివర్సిటీ రేటింగ్ కోసం పెద్ద ఎత్తున అవినీతి, వివరాలివే
Bribery for KL University Ratings 10 Arrested, Including NAAC Members(X)

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరంలోని కేఎల్ ఈఎఫ్ యూనివర్సిటీ(KL University) యాజమాన్యం నిర్వాకం బయటపడింది. రేటింగ్ కోసం లంచాలు(Bribery for Ratings) ఇచ్చినట్లు గుర్తించగా NAAC సభ్యులతో సహా 10 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది.

గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరంలోని కేఎల్ ఈఎఫ్ యూనివర్సిటీ రేటింగ్ కోసం భారీగా ముడుపులు అప్పజెప్పారు. NAAC పరిశీలన బృందానికి బంగారు నాణేలు, నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు లంచంగా ఇచ్చినట్లు గుర్తించింది సీబీఐ(CBI).

ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా 20 చోట్ల సీబీఐ సోదాలు(CBI Rides) నిర్వహించగా సీబీఐ సోదాల్లో రూ.37 లక్షల నగదు, 6 ల్యాప్ టాప్ లు, ఒక ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీకి చెందిన జేపీ సారథి వర్మ, కోనేరు రాజా, ఏ.రామకృష్ణతో పాటు NAAC పరిశీలన కమిటీ చైర్మన్ సమరేంద్ర నాథ్ సాహా, పలువురు కమిటీ సభ్యులను అరెస్టు చేసింది సీబీఐ.  వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. మూడు గంటలపాటు చర్చ.. అసలేం జరుగుతుంది??

 Bribery for KL University Ratings: 10 Arrested, Including NAAC Members

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 02, 2025 10:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).