Hyderabad, Feb 2: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల సంచలన ప్రకటన చేసిన మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మరో సంచలనానికి తెరలేపారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో (YS Sharmila) విజయసాయిరెడ్డి భేటీ అయినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం ఆయన హైదరాబాద్ లోని వైఎస్ షర్మిల నివాసానికి వెళ్లి దాదాపు మూడు గంటలపాటు ఆమెతో సమావేశమైనట్టు తెలిసింది. ఈ సందర్భంగా రాజకీయాలపై చర్చించినట్టు తెలిసింది. మధ్యాహ్న భోజనం కూడా అక్కడే చేశారని సమాచారం. జగన్ కు, షర్మిలకు మధ్య విభేదాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి షర్మిలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తున చర్చకు దారితీస్తున్నది.
హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం.. సమయానికి స్పందించడంతో తప్పిన ముప్పు (వీడియో)
విదేశీ పర్యటన
విజయసాయి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించినప్పుడు షర్మిల ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో వీరిద్దరూ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా 15 రోజుల పాటు ఇంగ్లాండ్, ప్రాన్స్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10వ తేదీ మధ్య విజయసాయి.. విదేశీ పర్యటన చేయనున్నారు.