Fire on Mangalagiri (Credits: X)

Vijayawada, Feb 2: ఏపీలోని (AP) గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి (Mangalagiri) శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి (Panakala Lakshmi Narasimha Swamy Temple) కొండకు శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకొన్నారు. మంటలు ఆర్పివేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ చర్యలు ఏ మాత్రం ఫలితం ఇవ్వలేదు. శనివారం సాయంత్రం 7 గంటలకు మొదలైన మంటలు.. రాత్రి 9 గంటల వరకు దావానలంలా రూపుదాల్చాయి. కొండపై నుంచి మంటలు క్రమంగా కిందకు వ్యాపిస్తుండటంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ప్రజలు బిక్కుబిక్కుమన్నారు.

ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, కుల గణన నివేదికను సభ ముందు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Here's Video

ఏదో మాయ చేసినట్టు..

ఇంతలో ఏదో మాయ చేసినట్టు అప్పటివరకూ బుసలుకొట్టినట్టు వ్యాపించిన మంటలు ఒక్కసారిగా ఆరిపోయాయి. దీంతో ప్రజలతో పాటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదంతా శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి మహిమేనంటూ భక్తులు ఆనందపారవశ్యంలో మునిగిపోయారు. కాగా, కొండపై మంటలు రాజేసిన దుండగులను పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొండపై తరుచూ మంటలు పెట్టడం కొందరికి నిత్యకృత్యంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా... హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు.. జీరోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, వైరల్‌గా మారిన వీడియోలు 

ఎంతో అద్భుతం

శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయం దేశంలో ఎంతో ప్రాశస్త్యం కలిగిన టెంపుల్ గా గుర్తింపు పొందింది. ఇక్కడి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శనమిస్తుంది.  భక్తులు స్వామికి సమర్పించే  పానకాన్ని పూజారి ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు.  పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది.  దీంతో  పానకం పోయటం ఆపి, మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.  ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు.  ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా, కొండపై ఒక్క చీమ కూడా కనిపించక పోవటం విశేషం. దీన్ని శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి మహత్యంగా చెప్తారు.