New assembly building in Telangana soon!(X)

Hyderabad, FEB  01: ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా (Telangana Assembly Special Meeting) సమావేశం కానున్నది. కుల గణన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) వెల్లడించారు. కుల గణనపై కేబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. భేటీలో ఉత్తమ్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఆదివారం మంత్రివర్గ ఉప సంఘానికి (Cabinet Sub Committee) కుల గణన నివేదిక అందుతుందని తెలిపారు.

Union Budget 2025: బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా... హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు.. జీరోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, వైరల్‌గా మారిన వీడియోలు 

ఈ నెల 5న మంత్రివర్గం ముందుకు కుల గణన నివేదిక వస్తుందని చెప్పారు. కేబినెట్‌ ఆమోదం అనంతరం అసెంబ్లీ ముందుకు కలగణన నివేదిక తీసుకువస్తామన్నారు. ఈ నెల 5న మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతుందని.. సమావేశంలో కుల గణన నివేదికను ప్రవేశపెడుతామన్నారు. ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా విజయవంతంగా కులగణన పూర్తయ్యిందని వివరించారు.