Fire Accident In Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం.. సమయానికి స్పందించడంతో తప్పిన ముప్పు (వీడియో)
హైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలోని ఓ బిల్డింగ్ లోని సెల్లార్ లో ఆదివారం వేకువజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Hyderabad, Feb 2: హైదరాబాద్ (Hyderabad)) లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు (Fire Accidents) నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలోని ఓ బిల్డింగ్ లోని సెల్లార్ లో ఆదివారం వేకువజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ కిందనున్న సెల్లార్ లో మంటలు చెలరేగి పై అంతస్తుల్లోకి క్రమంగా వ్యాపించాయి. అయితే, ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేయడంతో వాళ్లు వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే బిల్డింగ్ మొత్తం పొగ చూరిపోయింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం......
కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలో ఓ బిల్డింగ్‌లోని సెల్లార్లో అగ్ని ప్రమాదము సంభవించి పై అంతస్తుల్లొంచి దట్టమైన పొగ రావడంతో. ఘటన స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. pic.twitter.com/uvhDhE6BK3
— ChotaNews App (@ChotaNewsApp) February 2, 2025
మొన్న తుక్కు గోదాంలో..
పాతబస్తీలో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు పెరిగిపోయాయి. మాదన్నపేట చౌరస్తాలోని ఓ తుక్కు గోదాంలో నెలరోజుల క్రితం ఇలాగే మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బందికి దాదాపు ఆరు గంటల సమయం పట్టింది. రానున్న వేసవికాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, కుల గణన నివేదికను సభ ముందు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
(The above story first appeared on LatestLY on Feb 02, 2025 06:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

