దేశ రాజధానిలో ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేశారు. ఆ డబ్బును ఆ ముగ్గురు పంచుకున్నారు. అయితే సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. గాజీపూర్‌లోని థ్రిల్ లారీ సర్కిల్‌లో ఉన్న పోలీస్ చెక్‌పాయింట్ లోపలకు ఒక వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు పిలిచారు. అతడితో వాదన తర్వాత లంచంగా నోట్ల కట్టను పోలీస్ అధికారి తీసుకున్నాడు. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లగానే ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు అక్కడ కూర్చొన్నారు. గొప్ప మనసు చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్, అనారోగ్యంతో ఉన్న బాలుడిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్, వీడియో ఇదిగో..
లంచంగా తీసుకున్న డబ్బును ఆ ముగ్గురు పంచుకున్నారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దీని గురించి ఎక్స్‌లో స్పందించారు. ఇద్దరు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్స్ , ఒక హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ ముగ్గురు పోలీసులపై శాఖాపరమైన దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
Here's Video
दिल्ली ट्रैफिक पुलिस अधिकारी का रिश्वत लेते वीडियो वायरल
वीडियो गाजीपुर थाने के पास का बताया जा रहा है@DCPSouthDelhi @dtptraffic @CPDelhi @DelhiPolice @LtGovDelhi @DCPWestDelhi pic.twitter.com/QgROjCo80w
— The National Bulletin Hindi (@BulletinHindi) August 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)